NDL: మహానందిలోని టీటీడీ వసతి గృహాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని టీటీడీ జేఈవో డాక్టర్ శరత్ తెలిపారు. మహానందిలోని టీటీడీ వసతి గృహాలను గురువారం రాత్రి ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. నూతనంగా 50 వసతి గృహాలు నిర్మిస్తామని, వసతి గృహాల్లో భక్తులకు అవసరమైన రీతిలో గదులను పునరుద్ధరిస్తామన్నారు. మహానంది ఈవో శ్రీనివాసరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మహానందిలో 50 నూతన వసతి గృహాలు నిర్మిస్తాం'


