హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

30 మంది విద్యార్థుల రక్తదానం

CTR: రక్తదానం మహా ప్రాణదానంతో సమానమని జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ డాక్టర్ తేజోమూర్తి అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా గురువారం ఓ డిగ్రీ కళాశాలలో రెడ్ క్రాస్, ఈగల్ టీం సంయుక్తంగా నిర్వహించిన శిబిరంలో 30 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.