హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

CTR: జీడీ నెల్లూరు మండల పరిధి తచ్చూర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేపై ముసలయ్యగారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుకు ఎడమవైపు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. ఘటనలో నడుచుకుంటు వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందగా, ద్విచక్రవాహనదారుడికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో ఉంచారు.