హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

VZM: గుర్ల మండలం కోటగండ్రేడు పంచాయతీ పెదమజ్జిపేట గ్రామం నుంచి సుమారు 200 కుటుంబాలు గురువారం ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు సమక్షంలో టీడీపీలో చేరాయి. మాజీ ఎంపీటీసీలు ముద్దాడ కేశవరావు, ఉప్పిశెట్టి అప్పలస్వామి వారి అనుచరులతో కలిసి, అంబటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.