CTR: చౌడేపల్లి మండలం బైపల్లి సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. చౌడేపల్లి వైపు వెళ్తున్న ఆటో.. పుంగనూరు వైపు వెళ్తున్న బైక్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పుంగనూరుకు చెందిన సురేశ్ (40) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కు సమాచారం అందించి చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బైపల్లి వద్ద యాక్సిడెంట్


