హైదరాబాద్: 28°C
తెలంగాణ

కామారెడ్డి బల్దియాలో విజిలెన్స్ విచారణ..

KMR: మున్సిపాలిటీలో బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత లేదంటూ కౌన్సిలర్లు చేసిన ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు స్పందించారు. మూడు నెలల క్రితం శానిటేషన్, వాటర్ వర్క్స్, 14వ, 15వ ఆర్థిక సంఘం, స్పెషల్ డెవలప్‌మెంట్ పనుల బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, కమిషనర్ పర్వతాలు, అకౌంటెంట్ రాములు ఇష్టానుసారంగా బిల్లులు చెల్లిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు.