హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ 93.35 శాతం పూర్తి'

తూ.గో జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేసినట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బి.నగేష్ తెలిపారు. జిల్లాలో మొత్తం 2,65,947 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ. 108.85 కోట్లు సాయంత్రం వరకు అందజేసినట్లు పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీ 93.35 శాతం పూర్తి అయినట్లు చెప్పారు.