హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాము కాటుకు రైతు మృతి

TPT: కేవీబీపురం మండలం కాట్రపల్లికి చెందిన రైతు నాగలాపురం చిట్టిబాబు (43)పాము కాటుకు గురై చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. గత నెల 25వ తేదీ సజ్జ పంట కోస్తుండగా పాము కాటువేయడంతో పలు ఆసుపత్రాల్లో చికిత్స అందించారు. వైద్య ఖర్చులు, వ్యవసాయ అప్పులతో కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది. దాతలు సహాయం చేయాలనీ గ్రామస్థులు కోరుతున్నారు.