హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ప్రజలకు ఎస్పీ కితాబు

KMR: ప్రజలు సంకల్పిస్తే ఏదైనా సాధించగలరని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. దృఢ నిశ్చయంతో అసాధ్యం అంటూ ఏదీ లేదని పేర్కొన్నారు. డీజేలకు దూరంగా డప్పులు, బ్యాండ్లు, జానపద వాద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో గణనాథుడి ఊరేగింపు వైభవంగా సాగిందన్నారు. భక్తి, ఐక్యతలకు ఈ వేడుకలు నిదర్శనంగా నిలిచాయని తెలిపారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కేఎంఆర్ పోలీసుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.