హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత

అన్నమయ్య: అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతను ముమ్మరం చేశారు. కొండామారిపల్లి హెలిప్యాడ్ నుంచి బీకే పల్లి సభా వేదిక వరకు కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. రూట్, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లను ఎస్పీ ధీరజ్ పరిశీలించారు. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి లోపాలు లేకుండా విధులు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు.