JGL: జగిత్యాల మున్సిపల్ కార్యాలయ మేనేజర్‌గా సుష్మా గురువారం నియామకమయ్యారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జగిత్యాల పట్టణ ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని మేనేజర్‌కు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సత్య ప్రణవ్, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, బండ శంకర్ ఉన్నారు.
తెలంగాణ
జగిత్యాల మున్సిపల్ మేనేజర్‌గా సుష్మా


