హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎలక్ట్రిక్ స్కూటీ దగ్దం!

BDK: కొత్తగూడెం పట్టణంలోని రామవరం గోధుమవాగు బ్రిడ్జి సమీపంలో గురువారం ఎలక్ట్రిక్ స్కూటీ దగ్దమైంది.  కిరాణా దుకాణం ఎదుట నిలిపి ఉంచిన వాహనం ఓవర్‌హీట్ కావడంతో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు వారు ప్రయత్నించారు. ఎండ తీవ్రత వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.