హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కొరత ఉండొద్దు'

NRML: ప్రభుత్వ విద్యా సంస్థల్లో అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యా సంస్థల వసతుల కల్పనపై అధికారులతో సమావేశమయ్యారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించడంతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.