హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: మంత్రి

కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే బీసీలకు పూర్తి న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.