హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MLC అనంతబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత

KKD: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో MLC అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను రాజమండ్రి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు గురువారం కొట్టివేసింది. గతంలో బెయిల్‌పై బయటకు వచ్చి సాక్షులను బెదిరించినట్లు ఆరోపణలు ఉండటంతో పాటు, విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో ఆయనకు కోర్టులో చుక్కెదురైంది.