NLR: కావలి పట్టణం తుఫాన్‌నగర్‌లోని బైరాగులవీధిలో పొంగులూరి విజయలక్ష్మి (68) అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇంట్లో దోపిడీ చేసి గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న రెండో పట్టణ ఎస్సైలు గోపిచంద్, వెంకటేశ్వర్లు, రూరల్ ఎస్సై తిరుమలరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
కావలిలో మహిళ అనుమానస్పద మృతి!


