హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చీమకుర్తి గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం

ప్రకాశం: చీమకుర్తి మేడ్ వేస్ట్ క్వారీలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా గ్రానైట్ లేయర్ కూలిపోయింది. దాని కింద ఎంతమంది చిక్కుకున్నారనే విషయం తెలియాల్సి ఉంది. మీడియా ప్రతినిధులను సైతం లోపలికి అనుమతించలేదని సమాచారం. ఇటీవల గ్రానైట్ మైన్స్‌లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.