హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండారంలో అంగన్‌వాడీ ఉత్సవ్

SDPT: బెజ్జంకి మండలం గుండారం గ్రామంలో సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అంగన్‌వాడీ ఉత్సవ్‌ నిర్వహించారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను శాలువాలతో సత్కరించారు. చిన్నారులకు బిస్కెట్లు, స్వీట్లు పంపిణీ చేసి, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, మాతా శిశు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.