SDPT: ఖరీఫ్ 2026-27 సీజన్ వరిధాన్యం కొనుగోళ్లకు అక్టోబర్ 1 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఆదేశించారు. ఐడీవోసీలో బుధవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 424 కేంద్రాల ద్వారా 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
వరిధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు


