హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డివిజన్లో 30 పోలీస్ యాక్ట్ అమలు

CTR: చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో ఈనెల 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని డీఎస్పీ వెంకటనారాయణ గురువారం తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు, నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా దీనిని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.