హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదల సేవలో 2.0తో సమర్థవంతమైన పాలన: కలెక్టర్

సత్యసాయి: నల్లమాడలో 'పేదల సేవలో 2.0' కార్యక్రమాన్ని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. సంజీవని, ఎన్టీఆర్ వైద్య సేవలతో పాటు విద్య, పించన్లు, అన్నదాత సుఖీభవ పథకాలు అందిస్తున్నామని వివరించారు.