హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోదీ జన్మదిన వేడుకల పోస్టర్‌ విడుదల

నంద్యాల బీజేపీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకల పోస్టర్‌ను విడుదల చేశారు. జిల్లా అధ్యక్షుడు తప్పెట ప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జ్ వేల్పుల గోపాల్‌ పాల్గొన్నారు. మోదీ 75వ జన్మదినం సందర్భంగా 75 గంటల డప్పు కళాకారుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.