హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దువ్వాడలో స్వచ్ఛత శ్రమదానం

VSP: దువ్వాడ రైల్వే స్టేషన్‌, రైల్వే కాలనీలో దక్షిణ కోస్తా రైల్వే ఆధ్వర్యంలో స్వచ్ఛత శ్రమదానం నిర్వహించారు. విశాఖ డీఆర్‌ఎం లలిత్‌ బొహ్రా పాల్గొని పరిసరాలను పరిశీలించారు. పారిశుధ్య కార్మికులను సన్మానించారు. ప్రయాణికులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించి, రైల్వే కాలనీలో మొక్కలు నాటారు. స్వచ్ఛ రైల్వే వాతావరణం కోసం నిరంతరం కృషి చేస్తామని అధికారులు తెలిపారు.