హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగిత్యాలలో రూ.5 కోట్ల ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం

JGL: జగిత్యాల జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక లాభాలు వస్తాయని నమ్మించి బాధితుల నుంచి రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసం చేసిన..చల్గల్‌కు చెందిన మానాల మారుతిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ASPECT TRADER’ యాప్ ద్వారా పెట్టుబడిపై రోజుకు 1% లాభం, 100 రోజుల్లో పెట్టుబడి తిరిగి ఇస్తామని నమ్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.