హైదరాబాద్: 28°C
తెలంగాణ

విదేశీ విద్యకు బీసీ, ఈబీసీ విద్యార్థులకు అవకాశం

WNP: విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించారు. అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు తెలంగాణ ఈపాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు, వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. GRE/GMAT, IELTS/TOEFL వంటి అర్హతలు కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు అన్నారు.