హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీవీఎంసీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు

VSP: స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌-2026లో జీవీఎంసీకి రెండు రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కాయి. స్వచ్ఛ మున్సిపాలిటీ, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాల విభాగాల్లో జీవీఎంసీ ఎంపికైంది. స్వచ్ఛత వారియర్స్‌ విభాగంలో జీవీఎంసీ వెస్ట్‌జోన్‌కు చెందిన వై. నాగరాజు అవార్డుకు ఎంపికయ్యారు. అక్టోబర్‌ 2న విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.