VZM: విజయనగరం డీఎస్పీ ఎస్.రాఘవులు గురువారం మధ్యాహ్నం నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బందితో సమీక్ష నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భోగాపురం రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై జి.గోపాలరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ


