హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీ హాస్టల్‌ వద్ద తల్లిదండ్రుల ఆందోళన

ప్రకాశం: జరుగుమల్లి బీసీ సంక్షేమ హాస్టల్‌ వద్ద గురువారం విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌ వార్డెన్‌, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న MRO వెంకటేశ్వరరావు హాస్టల్‌ వద్దకు చేరుకుని తల్లిదండ్రులతో మాట్లాడారు.