హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ కుటుంబాలకు జగన్ భరోసా

PPM: ప్రమాదవశాత్తు మృతి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు వైఎస్ జగన్ రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. అక్టోబర్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చిందని చెప్పారు. పార్టీ కమిటీల్లో నియమితులైన అర్హులైన ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబానికి ఈ భరోసా లభిస్తుందని ఆమె స్పష్టం చేశారు.