హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుమ్మడి నరసయ్యను కలిసిన ఎమ్మెల్యే

NGKL: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గురువారం హైదరాబాద్‌‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మడి నరసయ్య నిరంతరం ప్రజాసేవే ధ్యేయంగా పనిచేశారని వంశీకృష్ణ పేర్కొన్నారు. సొంత ఆస్తులు కూడబెట్టుకోకుండా ప్రజలే తన ఆస్తిగా భావించి సేవలందించిన ఆయనను కలవడం గర్వంగా ఉందన్నారు.