ప్రకాశం: ప్రతి నెల 1న 'పేదల సేవలో' కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. మద్దిపాడులో గురువారం నిర్వహించిన పేదల సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతి నెల 1న పేదల సేవలో కార్యక్రమం'


