హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తల్లిదండ్రుల చెంతకు చేరిన బాలుడు

NLR: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం బోరవారిపాలెంలో తొమ్మిదేళ్ల రామయ్య ఆవేదనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. రామయ్య పరిస్థితిపై ఆరా తీసిన అధికారులు, నర్రవాడలో ఉన్న అతని తల్లిదండ్రులను గుర్తించి బాలుడిని వారి చెంతకు చేర్చారు. దీంతో రామయ్య తన తల్లిదండ్రులను కలుసుకోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది.