హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కంభంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన

ప్రకాశం: కంభం ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు శాంతియుతంగా నిరవధిక నిరసన కొనసాగిస్తున్నారు. పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా మధ్యాహ్న భోజన సమయంలో నిరసన చేపడుతున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉద్యోగులు అంగీకారపత్రాలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహించిన తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు.