హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరులో వృద్ధుల దినోత్సవం

ఎన్‌టీఆర్: జిల్లా తిరువూరులో ఐడియాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 36వ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. 91 ఏళ్ల నోముల జమలమ్మ, 86 ఏళ్ల తగరం అక్కమ్మ, 75 ఏళ్ల గుంజ హనుమమ్మ, కౌసల్యలను శాలువాలతో సన్మానించారు. 45 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వృద్ధులను ప్రేమ, ఆదరణతో గౌరవించాలని జనరల్ మేనేజర్ అంతయ్య సూచించారు.