SRPT: నడిగూడెంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఎన్. గీతాంజలి రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలకు ఎంపికైంది. పీఎం శ్రీ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన జిల్లాస్థాయి క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి అర్హత సాధించింది. ఈ సందర్భంగా గురువారం పాఠశాల ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి గీతాంజలిని అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలకు ఎంపిక


