KMM: ఇంటర్ MLT ఒకేషనల్ కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో క్లినికల్ శిక్షణ ఇవ్వనున్నట్లు డీఐఈఓ రవిబాబు తెలిపారు. ఎంపికైన వారు ₹1,000 డీడీ చెల్లించాలని తెలిపారు. గతంలో ఎంపిక కాని వారు కూడా అర్హులే అన్నారు. ఆసక్తి గలవారు అక్టోబర్ 15 లోగా కలెక్టరేట్‌లోని డీఐఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
MLT విద్యార్థుల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..!


