హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రిటైర్‌మెంట్ జీవితం సుఖసంతోషాలతో సాగాలి'

వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖలో 41 ఏళ్లపాటు సేవలందించిన ఎస్సై కె.గోపాల్ గురువారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా, అదనపు ఎస్పీ రాజేశ్ మీనా ఆయనను శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికారు. విధి నిర్వహణలో గోపాల్ చూపిన అంకితభావాన్ని అధికారులు కొనియాడారు. రిటైర్‌మెంట్ జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.