ASF: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం తక్కువగా ఉందన్నారు. అనుమతి లేకుండా గైర్హాజరయ్యే ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఎంఈఓలను ఆదేశించారు.
తెలంగాణ
విద్యార్థుల హాజరు శాతం పెంచాలి: కలెక్టర్


