హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరువులోనూ రైతులపై కనికరం చూపరా?

WNP: పంట రుణాల కోసం రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పాత అప్పు వడ్డీతో సహా చెల్లిస్తేనే కొత్త రుణం ఇస్తామనడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు వెంటనే పంట రుణాలు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ విమర్శలు చేశారు.