హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని నిర్దేశించి సాధించాలి'

ADB: విద్యార్థి దశలోనే మంచి లక్ష్యాన్ని నిర్దేశించి సాధించుకోవాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష అన్నారు.  పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో రాణించాలన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలపారు.