KNR: జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 9,11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 10, 2027న లాటరల్ ఎంట్రీ ఎంపిక పరీక్ష నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 8, 10వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
నవోదయలో ఖాళీ సీట్ల భర్తీ!


