హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పైప్‌లైన్‌ లీకేజీతో తాగునీరు వృథా

BHNG: తుర్కపల్లిలోని ఎంపీడీవో కార్యాలయ ప్రధాన గేటు వద్ద యాదగిరిగుట్ట రహదారిపై మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీతో తాగునీరు వృథాగా పోతోంది. ప్రతిరోజూ నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి లీకేజీకి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.