ADB: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో పనిచేస్తున్న దినసరి కార్మికులు వేతనాల కోసం నిరీక్షిస్తున్నారు.12 నెలలుగా వేతనాలు రావడంలేదని గురువారం మార్కెట్ కార్యదర్శి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోయారు. వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఉన్నతాధికారులు స్పందించి వెంటనే బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.
తెలంగాణ
వేతనాల కోసం దినసరి కార్మికుల నిరీక్షణ


