SDPT: నంగునూరు మండలం అక్కెనపల్లిలో చేపట్టిన ఈత వనాల పెంపకం కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈత చెట్ల పెంపకంతో చెరువు కట్టలకు రక్షణతో పాటు గౌడ కులస్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. నాటిన 500 మొక్కలను సంరక్షించాలని కోరారు. అనంతరం ఆయిల్‌పామ్ తోటను పరిశీలించి, సాగు విస్తరణపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు.
తెలంగాణ
ఈత వనాల పెంపకంతో ఉపాధి అవకాశాలు: హరీష్ రావు


