హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్

ADB: ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.