హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాస్టల్‌ భద్రతా లోపాలపై విచారణ చేపట్టాలి: SFI

ములుగు జిల్లా కేంద్రంలోని బీసీ ఎస్‌ఎంహెచ్ బాలికల హాస్టల్‌లో భద్రతా లోపాలపై సమగ్ర విచారణ జరిపి వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని SFI జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా అదనపు కలెక్టర్ సంపత్‌రావుకు వినతిపత్రం అందజేశారు. హాస్టళ్లలో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, వార్డెన్ల పర్యవేక్షణ పటిష్టం చేయాలన్నారు.