హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండభీమనపల్లిలో పోషణ మాసం ముగింపు వేడుకలు

NLG: దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో గురువారం పోషణ మాసం ముగింపు వేడుకలు ఐసీడీఎస్ సీడీపీఓ చంద్రకళ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలు, బాలికలు మంచి పోషకాహారం తీసుకోవాలన్నారు.