హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీలకంఠపురంలో వృద్ధులకు వైద్య పరీక్షలు

BPT: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా నీలకంఠపురం అనాధ వృద్ధ శరణాలయంలో గురువారం పందిళ్లపల్లి పీ.హెచ్.సీ డాక్టర్ జయకుమార్ వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వృద్ధుల ఆరోగ్య పరిరక్షణపై ఆయన అవగాహన సదస్సు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు డాక్టర్ సత్రం మల్లేశ్వరరావు, అధ్యక్షులు గుత్తి విశ్వేశ్వరరావు, కార్యదర్శి సజ్జా జోగేశ్వరరావు పాల్గొన్నారు.