హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తారు రోడ్డు పనులకు మాజీ వైస్ ఎంపీపీ శ్రీకారం

ASR: హుకుంపేట మండలం ముసిరిపాడు గ్రామానికి మంజూరైన పీఎం జన్‌మన్ తారు రోడ్డు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. మాజీ వైస్ ఎంపీపీ కొండలరావు, మాజీ సర్పంచులు, కూటమి నేతలు కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్థుల చిరకాల కోరిక నెరవేరనుంది. రోడ్డు నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడతాయని నేతలు తెలిపారు.