హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్ల జెండాలతో నల్గొండలో భారీ నిరసన

NLG: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష, ప్రజాస్వామ్య పార్టీలు గురువారం నల్లగొండలో నల్లజెండాలతో నిరసన తెలిపాయి. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని కోరాయి. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తోందని నాయకులు ఆరోపించారు.